Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 9, 2026Short Read
నాకు బెదిరింపులు వస్తున్నాయి.. దేనికైనా సిద్ధమే: జనసేన నేత, నటుడు తనీష్!
తనకు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బెదిరింపులు వస్తున్నాయని జనసేన నేత, నటుడు తనీష్ తెలిపారు.
‘సీతక్క గురించి మాట్లాడేంత పెద్దోడివా’ అంటూ కొందరు పెట్టిన అసభ్యకర మెసేజ్‌ను ఆయన ‘X’ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు.ఈ విషయమై తనీష్ స్పందిస్తూ..
"జనసేన జెండా చేతిలోకి తీసుకున్నప్పుడే నేను పోరాటానికి సిద్ధమయ్యాను.
ఒక ఆదివాసీ ఆడబిడ్డకు న్యాయం జరగాలనే ప్రయత్నిస్తున్నాను.
దీనిని వ్యక్తిగతంగా తీసుకుని బెదిరింపులకు దిగితే ఊరుకోను.
ఇసుక మాఫియా నుంచి కమిషన్ కాంట్రాక్ట్‌ల దందాల వరకు అన్ని అక్రమాలను బయటపెడతాను" అని తీవ్రంగా హెచ్చరించారు.





